ఆకాశవాణి ఆధ్వర్యంలో మహోన్నత స్ఫూర్తి – మహాత్మా గాంధీ కార్యక్రమం

ఆకాశవాణి ఆధ్వర్యంలో మహోన్నత స్ఫూర్తి – మహాత్మా గాంధీ కార్యక్రమం


గాంధీజీ 150 వ జయంతి ఉత్సవ సంవత్సరం సందర్భంగా 25 సెప్టెంబరు 2019, బుధవారం సాయంకాలం 4 గంటలకు సరోజినీ నాయుడు పూర్వ నివాసమయిన గోల్డెన్ త్రెషోల్డ్ లో 'మహోన్నత స్ఫూర్తి మహాత్మాగాంధీ' కార్యక్రమం జరుగనుంది.  ఈ కార్యక్రమాన్ని  ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.


 హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య  P. అప్పారావు అధ్యక్షత వహించే ఈ సదస్సులో జస్టిస్ J.చలమేస్వర్, తెలంగాణా గాంధీ స్మారక నిధి అధ్యక్షులు              P.జనార్ధన్ రెడ్డి, గాంధీని చూసిన సినీ నటి శ్రీమతి జమున, మాజీ మంత్రివర్యులు  T.పురుషోత్తమ రావు, ప్రముఖ సంపాదకులు  పొత్తూరి వెంకటేశ్వర రావు, సమతావాది  రావెల సోమయ్య, సీనియర్ అడ్వకేట్  ప్రతాప్ రెడ్డి, రిటైర్డ్ IAS అధికారులు  మోహన్ కందా,  జయ ప్రకాష్ నారాయణ్, ట్రూత్ లాబ్స్   P.C.గాంధీ, రచయిత  సలీం,        రచయిత్రి శ్రీమతి  పొత్తూరి విజయలక్ష్మి,   K.జితేందర్ బాబు, శ్రీ భూదానం సుబ్బారావు తదితరులు పాల్గొని 'నేటికీ ఆచరణీయం గాంధీ మార్గం' అంటూ తమ అభిప్రాయాలు తెలియ చేస్తారు.