<no title>అలీకి మాతృ వియోగం

అలీకి మాతృ వియోగం


ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి జైతున్‌ బీబీ బుధవారం రాత్రి 11.41 గంటలకు  కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె.. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. మరోవైపు అలీ తల్లి జైతున్‌ బీబీ మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. కాగా, తల్లిపై తనకున్న ప్రేమను అలీ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. పలు వేదికలపై కూడా తన తల్లి గురించి అలీ ఎంతో గొప్పగా చెప్పేవారు. 


Popular posts