21 ఏళ్లకే జడ్జిగా మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌!








'సమాజంలో న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. 2014లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో జాయిన్‌ అయ్యాను. రాజస్తాన్‌ యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది పట్టా పుచ్చుకున్నా. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో నా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించినందుకు గర్వంగా ఉంది. రాజస్తాన్‌ హైకోర్టు కనీస వయసు అర్హతను తగ్గించడంతోనే ఇది సాధ్యమైంది. చిన్న వయస్సులోనే జడ్జిగా కెరీర్‌ ఆరంభిస్తున్న కారణంగా సమాజానికి సుదీర్ఘ కాలంపాటు సేవ చేసే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని మయాంక్‌ చెప్పుకొచ్చాడు.