రజనీ, కమల్‌ కంటే నేనే సీనియర్‌: రాజేందర్‌

రజనీకాంత్‌, కమలహాసన్‌ల కంటే తానే సీనియర్‌నని నటుడు టీ.రాజేందర్‌ పేర్కొన్నారు. ఈయన గురువారం చెన్నైలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రజనీకాంత్, కమలహాసన్‌ రాజకీయాల గురించి తనను అడగడంలో అర్థం లేదని అన్నారు. నటులుగా రజనీకాంత్, కమలహాసన్‌లకు తాను అభిమానినని అన్నారు. అయితే రాజకీయాల్లో తాను వారిద్దరి కంటే సీనియర్‌నని అన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడానికి అనుభవం ఉంటే చాలదని,అదృష్టం ఉండాలని అన్నారు, తాను అధికారాన్ని పొందడానికి రాజకీయ పార్టీని ప్రారంభించలేదని అన్నారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల గురించి మాట్లాడడమే మానుకున్నానని అన్నారు.


తన చిత్రాల విజయానికి పామర ప్రజలు, మహిళలే కారణం అన్నారు. అయితే ఇప్పుడు సినిమాలను డబ్బున్న వాళ్లే చూసే పరిస్థితి నెలకొందని అన్నారు. వచ్చే నెల 22న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాల సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజేందర్‌ జట్టు పోటీ చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ జట్టులో టీ.రాజేందర్‌ అధ్యక్ష పదవికి, మన్నర్‌ ఫిలింస్‌ మన్నర్‌ కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నట్లు తెలిపారు.   
 Popular posts